Karthika Deepam2 : జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ లో గౌతమ్ గురించి దీప నిజం చెప్తుందా!
on Mar 25, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -313 లో.....జ్యోత్స్న ఎంగేజ్ మెంట్ కి ఏర్పాట్లు చేస్తారు. దశరథ్, శివన్నారాయణ ఇద్దరు వచ్చే రెలెటివ్స్ ని ఆహ్వానిస్తుంటారు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావ్ రా ఎవరు పిలిచారని శివన్నారాయణ కోప్పడుతుంటే.. ఎవరు పిల్వలేదు.. పిలిస్తేనే రావాలా ఏంటని శ్రీధర్ వెటకారం గా మాట్లాడతాడు. అప్పుడే గౌతమ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తారు.
ఇక వాళ్ళ ముందు శివన్నారాయణ.. శ్రీధర్ ని ఏమనలేకపోతాడు. గౌతమ్ అని శ్రీధర్ అంటాడు. ఎవరు అతను అని గౌతమ్ పేరెంట్స్ అడుగుతారు. ఈ ఇంటికి అల్లుడిని అని శ్రీధర్ పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత అందరు లోపలికి వెళ్తారు. అప్పుడే కార్తీక్, దీప లు చేసిన వంటలన్ని తీసుకొని వస్తారు. మీరు ఎందుకు వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. కేటరింగ్ మాదే.. అమ్మ మాత్రం ఎంగేజ్ మెంట్ కి వచ్చిందని కార్తీక్ అంటాడు. అప్పుడు కూడా తండ్రీ కొడుకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.అప్పుడే సుమిత్ర దశరథ్ లు కాంచనకి ఎదరు వచ్చి ఆహ్వానిస్తారు. కార్తీక్ నువ్వు కూడా లోపలికి రా అని సుమిత్ర అనగానే నాకు ఆహ్వానం ఉంది కానీ నా భార్యకి లేదని కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నాకు ఒక్కప్పుడు నువ్వు అంటే చాలా గౌరవం ఉండేది కానీ నువ్వు పోగొట్టుకున్నావని దీపతో సుమిత్ర అంటుంది.
ఆ తర్వాత మీ అల్లుడు ఒక్కడే వచ్చాడా? మీ కూతురు ఎక్కడ అని గౌతమ్ పేరెంట్స్ అడుగుతారు. మా చెల్లి ఇదిగో వచ్చిందని దశరత్ అంటాడు. నా అల్లుడు తన భార్య బయటున్నారని వాళ్ళతో దశరత్ చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి కాంచన వెళ్తుంది. మిమ్మల్ని ఇన్ని రోజులు బాధపెట్టిన అత్తయ్య క్షమించు అని జ్యోత్స్న అంటుంటే.. సుమిత్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
